ప్రజా ఫిర్యాదులను పరిష్కారించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజలు వారి ఫిర్యాదుల గురించి పోలీస్ అధికారులుకు విన్నవించుకున్నారు. ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో అందిన ఆయా ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు సత్వరం న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్, ఎక్కువ భూ వివాదాలు మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని….
తనకు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, చిలకలూరిపేటకు చెందిన ఒక వ్యక్తి తన వద్ద నుండి సుమారు 5 లక్షలు రూపాయలు తీసుకొని కొనకమిట్లలో ఒక ప్రైవేట్ ఏజెన్సీ లో సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయిన తర్వాత 16 నెలలు పాటు పని చేసిన తర్వాత ఉద్యోగం నుండి తొలగించారు. ప్రభుత్వ ఉద్యోగమని నమ్మించి మోసం చేశారని తీసుకున్నా డబ్బులు తిరిగి ఇవ్వలేదని బాధితులు ఫిర్యాదు.
ఒంగోలు నగేంద్రనగర్ 1వ లైన్లో నివాసముండే ఒక వ్యక్తి, తన ఇంటిని మరొక వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. అయితే, అద్దెకు తీసుకున్న వ్యక్తి ఇంటి అద్దె చెల్లించకుండా, ఇల్లు ఖాళీ చేయకుండానే, ఇంటి యజమానిని బెదిరిస్తూ, ఆయన నుండే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని బాధితుడు ఫిర్యాదు.
తన కుటుంబ అవసరాల కోసం, ఒంగోలు రాంనగర్‌కు చెందిన ఇద్దరు మహిళ వద్ద బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నట్లు, కొన్ని అనివార్య కారణాల వల్ల వడ్డీ చెల్లించలేకపోయినట్లు, వారు తన బంగారాన్ని అమ్మేశారని, డబ్బు మొత్తం చెల్లిస్తామని చెప్పినా, ఆ ఇద్దరు మహిళలు మరియు వారి కుటుంబ సభ్యులు తనపై దౌర్జన్యం చేశారని బాధితురాలు ఫిర్యాదు.
ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఎస్సీ, ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ జగదీష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

