తాళ్లూరు: మండలంలోని మన్నేపల్లి పీఏ నీ ఎన్ చైర్మన్ గొంది రమణా రెడ్డి (సమర) ప్రమాణ
స్వీకారోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. మన్నేపల్లిలోని కార్యాలయంలో శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన నభలో పీఏసీఎన్ చైర్మన్ రమణా రెడ్డి (సమర) మాట్లాడుతూ .. రైతులకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్, పార్టీ పెద్దలకు లకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కృషి చేసి మెరుగైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. టిడిడి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులకు వెన్నదన్నుగా ఉన్నారని, అన్నదాత సుఖీభవ, డ్రిప్ ఇరిగేషన్, అవసరమైన పనిముట్లు నబ్సిడీకి అందిస్తున్నదని చెప్పారు. నియోజక వర్గంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు నిత్యం రైతులకు అవనమైన మేర సేవలు అందించటాన్ని వివరించారు. దర్శి సహకార సొసైటీ సహకారాధికారి జిలాని బాష, తూర్పుగంగవరం సొసైటీ బ్యాండు మెనేజర్ మాధవ రావు సొసైటీ బ్యాంకు సేవల గురించి వివరించారు. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నామని, ఎకరానికి రూ.1.50 లక్షల వరకు ఇస్తున్నట్లు చెప్పారు. నాగంబొట్ల పాలెం పీఎన్ ఎన్ అధ్యక్షుడు వల్లభనేని నుబ్బయ్య మాట్లాడుతూ …రైతు రాజు అంటున్నారు గాని రైతుకు నిత్యం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఒక్కరోజు రైతులా కష్టపడితే దళారి వ్యవస్థలో దళారులు మోసం చెయ్యరని అన్నారు. సోసైటీ బ్యాంకులు కూడా రైతులకు అవసరమైన మేర వడ్డీ తక్కువతో రుణాలు ఇవ్వాలని సూచించారు. యూరియా అవసరమైన వారు తమ సొసైటీ పరిధిలో కూడ ఉన్నదని ఉపయోగించుకోవాలని కోరారు. నీటి సంఘం ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసి రైతులను అదుకోవాలని సూచించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు వెలుగు ఏడుకొండలు, ఎఎంసీ డైరెక్టర్ హనుమా రెడ్డి, వలి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం సొసైటీ అధ్యక్షుడు నమరిని ఘనంగా పార్టీ శ్రేణులు, అభిమానులు సన్మానించారు. సమావేశంలో పలువురు మహిళలు యూరియా అందుబాటులో లేదని, తమ గడ్డికి యూరియా వేయక పోతే పెరగటం లేదని కొరత తీర్చాలని కోరారు. సొసైటీ పరిధిలో త్వరలో అందజేస్తామని సొసైటీ అధ్యక్షుడు హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు పాల్గొని నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ గొంది రమణారెడ్డి ( సమర )కి శుభాకాంక్షలు తెలిపారు.

