రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి. విజయ్‌కుమార్ (రిటైర్డ్ ఐఏఎస్) సౌత్ కోస్టల్ జిల్లాలలోని ప్రకాశం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల ప్రాజెక్ట్ మేనేజర్లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో పాటు ప్రకాశం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సుభాషిణి పాల్గొన్నారు.
మొదట నాగులుప్పలపాడు మండలం బి.నిడమానూరు గ్రామంలో రైతు ఎం. అనుపమ 7 ఎకరాల్లో పీఎండీఎస్ సాగును, అనంతరం పోతవరం గ్రామంలో పి. శేషారావు మొక్కజొన్న క్షేత్రాన్ని వీక్షించారు. తదుపరి రైతు సేవా కేంద్రంలో విజయ్‌కుమార్ రైతులతో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ… ప్రకృతి వ్యవసాయం పర్యావరణానికి మేలు చేస్తుంది. రైతుల ఖర్చులు తగ్గి, మంచి లాభాలు వస్తాయి. రసాయన ఎరువులు, మందులు మానుకుని జైవ పద్ధతులు అవలంబించాలి అని సూచించారు.
తరువాత ఒంగోలు మండలం కొప్పోలు గ్రామంలో మాధురి గారి డ్రై ప్యాడి క్షేత్రాన్ని కూడా వీక్షించారు.
అనంతరం కలెక్టరేట్ సిసి హాల్లో సౌత్ కోస్టల్ ఐదు జిల్లాల ప్రాజెక్ట్ మేనేజర్లతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ టిఎల్ గోపీచంద్, సౌత్ కోస్టల్ జిల్లాల ప్రాజెక్ట్ మేనేజర్లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

