జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, ఒంగోలు రూరల్ మండల పరిధిలోని చెరువుకొమ్ముపాలెంలోగల శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలను సందర్శించి డిఎస్సి-2025 కు సంబంధించి జరుగుచున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను
గురువారం పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పటిష్టంగా చేపట్టాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, విద్యా శాఖాధికారులను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ వెంట స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, విద్యా శాఖకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
