తాళ్లూరు మండలంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండలంలోని
16 పంచాయితీలలో 51 విగ్రహాల వరకు ఏర్పాటు చేసి శాస్త్ర యుక్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామాలలో భక్తులు ఉభయ దాతలుగా ఉంటూ భక్తి శ్రర్థలతో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. బొద్దికూరపాడు బీసీ కాలనీలో ముస్లీంలతో కలిసి వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ హిందూ ముస్లీంల ఐక్యతను చాటుతున్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ విధంగా గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి హిందూ ముస్లీం భాయి భాయి అని నిరూపిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. తూర్పుగంగవరం తో పాటు పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఎన్ఐ మల్లిఖార్జున రావు తన సిబ్బందితో కలిసి పరిశీలించి కమిటీ సభ్యులుకు పలు సూచనలు చేసారు.


