పశువులకు అన్ని రకాల పోషకాలు అందిచే విధంగా గడ్డిని అందించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. మండలంలోని శివరామపురం, మల్కాపురం గ్రామాలలో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 30,816 పశువులు ఉన్నాయని వాటిని అవసరమైన అన్ని రకాల పోషకాలను ఇస్తే మంచి బాల దిగుబడి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో విఏఏలు రాజేష్ మణికంఠలు పాల్గొని నేపియర్, పారా గడ్డి, సూపర్ నేపియర్, అంజిన్, అలచంద, పిల్లి పినర, జనుము, స్టైలో, సుబాబుల్, అవిశ, వెల్వేట్ బీన్స్, లూసెర్న్. గరిక మొదలగు రకాల గడ్డిని రక రకాలుగా మార్చి మార్చి అందించాలని చెప్పారు. కార్యక్రమంలో విఏఏ లు అజ్మీర్, అశోక్, మార్క్టింగ్ అసిస్టెంట్ శ్రీనివాస రావు, వి ఆ ర్ ఓ చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.
