ప్రభుత్వం చేపడతున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సక్రమంగాఅమలు జరిపిం చేబాధ్యత అధికారులదే-మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు జరిపించే బాధ్యత మండల స్థాయి అధికారులదేనని తాళ్లూరు మండల ప్రత్యే కాధికారి ఎం. వెంకటేశ్వరరావు అన్నారు. తాళ్లూరు ఎంపీడీవో చాంబర్లోఎంపీడీవో సానికొమ్ముసత్యం అధ్యక్షతన మండలస్థాయి అధికారుల సమావేశం శుక్రవారంజరి గింది. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన పథకాలు సక్రమంగా గ్రామస్థాయిలో అమలు జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల నిర్వహణలో సమస్యలు వస్తే తన దృష్టికి తీసుక వస్తే తగు చర్యలు చేపడతామన్నారు.గ్రామాల్లోప్రజల సమస్యలు విన్నవిస్తే ఆయాశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరి ష్కార మార్గం చూపాలన్నారు.గృహా నిర్మాణాల లబ్దిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీలో సమస్యలు వుంటే తహసీల్దార్ ను
సంప్రదించి పరిష్కరించుకోవాలని హౌసింగ్ అధికారులకు సూచించారు.ఎన్ఆర్ఆజీఎస్ పథకంగా గ్రామాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించినా ఎందుకు పురోగతి లేదని, లబ్దిదారులకు అవగాహన కల్గించి వేగవంతంగా పూర్తి చేయించాలని ఉపాధి హామీ పథకం ఆధికారులకు సూచించారు. గ్రామాల్లో రామతీర్థం నీటి సరఫరాలో అంతరాయం జరుగకుం డా మర్శత్తులు వున్నా తక్షణమే మరమ్మత్తులు జరిపించి నీటి సరఫరా జరిగేలా చూడాలని ఆర్డబ్ల్యుఎస్ అధికారులకు తెలిపారు.
వర్షాలుకురుస్తూ ప్రజలు వ్యాదిగ్రస్తులవులున్నారని వైద్యశాఖ అప్రమత్తంగా వుండి తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయి అధికారులు అప్రమత్తం గా వుంటూ గ్రామ స్థాయి ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించేలా చూడాల న్నారు.క్షేత్రస్థాయిలో సచివాలయ ఉద్యోగులు, ఇతరశాఖల సిబ్బంది ప్రజలకు అం దుబాటులో వుండి తగు చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. తాళ్లూరులో హౌసింగ్ కాలనీ, నాగం పట్ల వారి పాలెం లో ఇంకుడు గుంతల నిర్మాణాల్ని ప్రత్యేక అధికారి పరిశీలించారు. పురోగతికి తగిన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బివిరమణారావు, హౌసింగ్ అధికారి హనుమంతరావు, ఏపిఎమ్ దేవ రాజ్, ఏపీవో వెంకటేశ్వరరావు.వైద్యాధికారి రాజేష్యాదవ్, ఆర్డబ్ల్యు ఎస్ఏఈ వాలి. తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *