ఎరువుల కొరత సృష్టిస్తేచర్యలు తప్పవు- తహసీల్దార్ బి.వి.రమణారావు

ఎరువులు, పురుగుల మందుల దుకాణం దారులు కావాలని ఎరువుల కొరత సృ ష్టిస్తే తగు చర్యలుతప్పవని తహసీల్దార్ బి.వి.రమణారావు తెలిపారు. విజిలెన్సు కమిటీ సభ్యులుతహసీల్దార్, వ్యవసాయాధికారి ప్రసాదరావు, ఏఎస్సై మోహన్ రావు లు తాళ్లూరులో ఎరువులు, పురుగుమందుల దుకాణాలను శుక్రవానం ఆకస్మికం గా తనిఖీ చేశారు. తాళ్లూరులోని శ్రీ కృష్ణాఎంటర్ ప్రైజర్స్ షాపును తనిఖీ చేసి రికార్డు లను పరిశీలించగా షాపు నందు అన్ని రకాల ఎరువులు 113.25 మెట్రిక్ అందుబ టులో వున్నట్లు, శ్రీలక్ష్మి వెంకట రమణ ట్రేడర్స్ను పరిశీలించగా 77.35 టన్నుల ఎరువులు అందుబాటులోవున్నట్లు గుర్తించారు. రైతులకు సరిపడ ఎరువులను మాత్రమే అందించాలని, ఒక్కో రైతులకు 10బస్తాల మేర అందించాలని తహసీల్దార్ డీలర్లకు సూచించారు. 10 కంటే ఎక్కువ బస్తాలు అసరమైన రైతులకు చెందిన పాస్ బుక్
ను ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. రోజువారీ ఏఏ ఎరువులురోజువారి ఏఏఎరువులు ఎన్ని బస్తాలు విక్రయించారో, ఎంత స్టాక్ నిల్వవుందో ఏరోజుకా రోజురికార్డుల్లో నమోదు చేసి అధికారులకు తెలియపరచాలన్నారు. తమ ఇష్టాను సారం తప్పుడు పేర్లు నమోదు చేసి కృత్రిమ కొరత సృష్టించినా, ప్రభుత్వ ధరలకంటే ఎక్కువ రేట్లకు అమ్మినా, అక్రమంగా ఎరువులనిల్వలు వుంచినట్లు గుర్తించినా తగు చర్యలు
చేపట్టి లైసెన్సులు రద్దు చేయటం జరుగుతుందన్నారు. దుకాణదారులు ప్రభుత్వా నికి సహకారం అందించి రైతులకు ఎరువులు అందించాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *