ఎబీసీ హైస్కూల్లో చిన్నారులు ఏర్పాటు చేసుకున్న గణనాధునికి మూడు రోజులు ప్రత్యేక పూజల అనంతరం ఉత్సాహంగా గంగ ఒడికి చేర్చారు. ఎబీసీ హైస్కూల్ కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కాలేషాబాబులు మాట్లాడుతూ… కుల మతాలకు అతీతంగా విద్యార్థులు భక్తి భావంతో పెరిగితే సమాజం పట్ల మరింత బాధ్యత ఉంటుందని అన్నారు. ప్రతి చిన్న విషయాన్ని గ్రహించి, సూక్ష్మంగా ఆలోచించి, కష్టాన్ని సైతం ధైర్యం ఎదుర్కోనే నైజం అలవాటు చేసుకోవాలని అన్నారు. ప్రత్యేక పూజల అనంతరం చిన్నారులు కోటాటం చేస్తూ కేరింతలు కొడుతూ స్వామి వారిని గంగ ఒడికి చేర్చారు. చిన్నా పెద్దా తేడా లేకుండా డ్యాన్సులు చేస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ముందుకు కదిలారు.




