పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలాన్ని వివాదాల్లోకి లాగడం మంచిదికాదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. శ్రీశైలం ఆలయాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని మీడియాలో వస్తున్న ప్రచారాలపై మంత్రి స్వామి స్పందించారు. ఈ సందర్భంగా శనివారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ….కొంతమంది రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.-మార్కాపురం,యర్రగొండపాలెం,గిద్దలూరు,కనిగిరి,దర్శి పశ్చిమ ప్రాంతాలను మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించాం. శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలన్న ప్రతిపాదనలేదు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి వస్తున్న ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుంది. ఈ అంశంపై రెండు జిల్లాల ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ అంశంపై ఎవరూ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలాన్ని వివాదాల్లోకి లాగడం మంచిదికాదు -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి
30
Aug