ఒంగోలు నగరం, సీతారామపురంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు సెప్టెంబర్ 3 బుధవారం మహా అన్నదాన సంతర్పణ జరుగుతుందని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కమిటీ ఒక ప్రకటనలో తెలియజేశారు.
వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు అంగరంగ వైభవంగా స్వామివారు పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. బుధవారం కార్యక్రమాలలో భాగంగా ఉదయం 8 గంటలకు వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ, వారి శిష్య బృందంచే 32 గణపతుల మహాగణపతి, లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందని ఆలయ కమిటీ వారు తెలియచేశారు. గత 32 సంవత్సరాల నుండి నిర్విరామంగా మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని, ఆ ప్రకారం గణపతికి ఈ సంవత్సరం 32 కేజీల లడ్డును ప్రసాదం గా సమర్పించడం జరిగినదని కమిటీ వారు తెలియజేశారు.
కావున సీతారామపురం, పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారి కృపా కటాక్షాలు పొంది, స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
సెప్టెంబర్ 3న మహాగణపతి, లక్ష్మీ గణపతి హోమాలు – భక్తులకు అన్నసంతర్పణ
02
Sep