నీతి నిజాయితీ, విలువలు కలిగిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడుప్రజా ఆశీర్వాదం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ కుట్రలు, కుతంత్రాలు ఎప్పటికీ చెల్లవు -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి

నీతి నిజాయితీ, విలువలు కలిగిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం నారా చంద్రబాబు నాయుడని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ……నీతి నిజాయితీ, విలువలు కలిగిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం నారా చంద్రబాబు నాయుడు. అలాంటి నేతని సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది చీకటి రోజు, వైసీపీ పతనానికి నాంది పలికిన రోజు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ దేశ విదేశాల్లోని తెలుగు వారు సైతం ఆయనకి అండగా నిలబడి ఆందోళనలు చేశారు. చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టినా ప్రజలు ఆయన్ని కడిగిన ముత్యంలా సీఎం సీటులో కూర్చోబెట్టారు. ప్రజల ఆశీర్వాదం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ కుట్రలు, కుతంత్రాలు ఎప్పటికీ చెల్లవని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *