జిల్లా లోని ఒంగోలు నగర కార్పోరేషన్ తో పాటు అన్నీ మునిసిపాలిటీల్లో ఘన వ్యర్థాల నిర్వహణ పై ప్రజల్లో అవగాహన కల్పించుటకు ఐటీసీ సంస్థ చొరవ తీసుకోవడం అభినందనీయం – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

జిల్లా లోని ఒంగోలు నగర కార్పోరేషన్ తో పాటు అన్నీ మునిసిపాలిటీల్లో ఘన వ్యర్థాల నిర్వహణ పై ప్రజల్లో అవగాహన కల్పించుటకు ఐటీసీ సంస్థ వెల్-బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ ( డబ్ల్యూ ఓ డబ్ల్యూ ) కాన్సెప్ట్ తో చొరవ తీసుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
అన్నారు.
స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యర్ధాల నిర్వహణ మరియు సోర్స్ సేగ్రిగేషన్ కు సంబంధించి ఐటిసి, ఎజిఎస్ సంస్థల వారు ఒంగోలు నగరంతో పాటు కనిగిరి, మార్కాపురం మునిసిపాలిటీ లతో ఎంఓయు చేసుకోగా, ఈ విషయంపై మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నగర మున్సిపల్ కమీషనర్ తో పాటు జిల్లాలోని అన్నీ మునిసిపాలిటీల కమీషనర్లతో, ఐటిసి, ఎజిఎస్ సంస్థల ప్రతినిధులతో సమావేశమై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఐటీసీ సంస్థ ప్రతినిధి సుధారాణి వెల్-బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ ( డబ్ల్యూ ఓ డబ్ల్యూ ) కాన్సెప్ట్ తో చేపట్టనున్న వ్యర్ధాల నిర్వహణ మరియు సోర్స్ సేగ్రిగేషన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వెల్-బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ (డబ్ల్యూ ఓ డబ్ల్యూ)
కార్యక్రమం అన్నీ మునిసిపాలిటీల్లో అమలు చేస్తూ దానికి సంబంధించి సమగ్రంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఐటిసి, ఎజిఎస్ సంస్థల వారు వ్యర్ధాల నిర్వహణ మరియు సోర్స్ సేగ్రిగేషన్ కు సంబంధించి రాష్ట్రంలో 30 మునిసిపాలిటీలతో ఎంఓయు చేసుకోవడం జరిగిందని, జిల్లాలో ఇప్పటికే ఒంగోలు నగరంతో పాటు కనిగిరి, మార్కాపురం మునిసిపాలిటీ లతో ఎంఓయు చేసుకోవాదం జరిగిందని ఐటిసి ప్రతినిధి సత్య శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కు వివరించడం జరిగింది.
ఈ సమావేశంలో ఒంగోలు మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు, మెప్మా పిడి శ్రీహరి, ఎజిఎస్ సంస్థ ప్రతినిధి అశోక్, సార్డ్స్ ప్రతినిధి సునీల్ కుమార్, నాగేంద్ర, రాజశేఖర్, జిల్లా లోని అన్నీ మునిసిపాలిటీల కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *