రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీ అన్సారియా

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఏ తమీ అన్సారియా, వైద్యులకు సూచించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ ఏ తమీ అన్సారియా, ముండ్లమూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగుల రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ను, క్యాజువాలిటి రూములను, మెడిసన్ స్టోరేజి విభాగాలను, ల్యాబ్ తదితర విభాగాలను సందర్శించి సంబందిత రిజిస్టర్స్ క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత 15 రోజుల్లో ఎన్ని ఫీవర్ కేసులు నమోదు అయినవి, నమోదు అయిన ఫీవర్ కేసులలో ఎంతమందికి పరీక్షలు నిర్వహించారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9వ తేదీన 10 ఫీవర్ కేసులు రాగా అందులో 8 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని వైద్యులు, జిల్లా కలెక్టర్ కు వివరించారు. ప్రతి ఫీవర్ కేసును క్షుణ్ణంగా పరీక్షించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్, వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడుతూ, అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. పేద ప్రజల ఆరోగ్యం చాలా కీలకమని, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నిర్లక్ష్యం వహించరాదనీ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, వైద్యులకు సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు చేపడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు. ఈ ఏదైనా గ్రామం నుండి ఎక్కువ మంది ఫీవర్ తో బాధపడుతూ పిహెచ్సి కి వచ్చినట్లయితే ఆ గ్రామాన్ని వైద్యులు సందర్శించి పరిశీలించాల్సిన అవసరం వుందని జిల్లా కలెక్టర్, వైద్యులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, డిపిఓ వెంకటేశ్వర రావు, తహసిల్దార్ లక్ష్మీనారాయణ ఆసుపత్రి వైద్యులు డా. సుస్మిత, వెంకటేశ్వర రెడ్డి , సిబ్బంది తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *