మాతాజీ నగర్ లో 100 మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం…..

బేగంపేట సెప్టెంబర్ 11(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట డివిజన్ మాతాజీ నగర్ లో 100 మంది మహిళలకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం కుట్టు మిషన్లు, సర్టిఫికెట్ లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణి దేవి,బేగంపేట కార్పొరేటర్ టి.మహేశ్వరి శ్రీహరి తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజకవర్గంలో అత్యధికంగా నిరుపేదలు ఉన్నారన్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కృషి చేసేందుకు తనవంతు సహాయంగా వారికి శిక్షణ ఇప్పించి తమ సొంత నిధులతో కుట్టుమిషన్లు అందించడం జరుగుతుందన్నారు.ఇప్పటికే నియోజకవర్గంలో 2000 మందికి పైగా అందించామని ఇకముందు కూడా ప్రతి సంవత్సరం శిక్షణ ఇప్పించి వారికి కుట్టు మిషన్లు అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు.
ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ఖార్డ్ సంస్థ అధినేత సుమన్ మంజులత దంపతులను అభినందించారు.వారికి శిక్షణ అందించి సరైన నైపుణ్యం అందిస్తున్నందుకు వారు చేసే సేవా కార్యక్రమాలకు అభినందిస్తున్నానని అన్నారు. అలాగే మహిళలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ముందుకు వెళ్లాలని,ఏదైనా ఇబ్బంది ఉంటే తనని నేరుగా సంప్రదించవచ్చని గుర్తు చేశారు.అదేవిధంగా సురభి వాణి దేవి మాట్లాడుతూ మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడి ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , ఖార్డు సంస్థ అధినేతలు మంజులత దంపతుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, డివిజన్ అధ్యక్షులు సురేష్ యాదవ్.జనరల్ సెక్రెటరీ నరేష్ .మహిళ ప్రెసిడెంట్ సునీత ,మాతాజీ నగర్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *