బేగంపేట సెప్టెంబర్ 11(జే ఎస్ డి ఎం న్యూస్)
ట్రాఫిక్ లో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులు తమ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ట్రాఫిక్ 1డి సి పి రాహుల్ హెగ్డే అన్నారు.గురువారం తిరుమల గిరి లోని సిటీ న్యూరో సెంటర్ లో ఆరోగ్య పరిరక్షణ ,శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉత్తర మండలంలోని పోలీస్ అధికారులు,సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో రక్త పోటు,బరువు ,ఈ సి జీ ,ఆర్ బి ఎస్ ,సీరం క్రియాటినిన్,హిమోగ్లోబిన్, ప్లేట్ లెట్ కౌంట్,టోటల్ డబ్ల్యూ బి సి కౌంట్ వంటి పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను పోలీసులు ఉపయోగించుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు పరీక్షలు నిర్వహించుకున్నారు.ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు సిటీ న్యూరో సెంటర్ లో నిర్వహించారు. సుమారు 250–300 మంది పోలీస్ సిబ్బంది ఇందులో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.


