భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో కళలు ఒక భాగమని జిల్లా విద్యాశాఖాధికారి ఎ కిరణ్ కుమార్ అన్నారు. ఎపీ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళా ఉత్సవం -2025 పోటీలు మైనంపాడులోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ లో గురువారం ప్రారంభమైనాయి. డైట్ ప్రిన్సిపాల్ సామ సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఎ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కళలు పోటీ తత్వం పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. డైట్ ప్రిన్సిపాల్ సామ సుబ్బారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులలో ఉన్న కళలను వారి సామర్ధ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని విద్యార్థులు
సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒంగోలు, పర్చూరి డివిజన్ల నుండి 39 ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల నుండి 311 మంది విద్యాయర్థులు హాజరైనారు. డైట్ చరిత్రలో ఇంత మంది విద్యార్థులు హాజరు కావటం చాలా అరుదైన సంఘటనగా ఉపాధ్యాయులు తెలిపారు. కళా ఉత్సవ పోటీలతో పండుగ వాతావరణం ఏర్పడినది. ఆరు కళలలో 12 విభాగాలలో గురువారం పోటీలు ఉంటాయని డైట్ ప్రిన్సిపాల్ సుబ్బా రావు తెలిపారు. 12వ తేదిన కందుకూరు, మార్కాపురం డివిజన్స్ కు చెందిన కళా ఉత్సవ్ పోటీలు జరుగుతాయని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే విద్యార్థులను ఈ పోటీలకు తీసుకురావాలని రెండు డివిజన్లలోని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు డైట్ ప్రన్సిపాల్ సూచించారు.

