ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేయాలి – జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు,
జిల్లా అధికారులను ఆదేశించారు.
శనివారం ప్రకాశం జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా అధికారులతో సమావేశమై వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకుంటూ, ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలుచేస్తున్న ప్రాధాన్యత కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు సంబంధిత శాఖల జిల్లా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు జవాబుదారీతనంతో, నిజాయితీతో, బాధ్యతతో విధులను నిర్వర్తించాలని, అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే ఆర్జీలను సంబందిత శాఖల అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని జవాబుదారీతనంతో అర్జీదారులకు సంతృప్తికరమైన పరష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆ దిశగా అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిష్కారం కాని సమస్య అంటూ ఉండదని, ఆ సమస్య పై ప్రత్యేక దృష్టి సారించి సమగ్రంగా పరిశీలన చేసి వాటి పరిష్కార మార్గాలు, సమస్య మూలలు తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ఆయా శాఖలకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు, అధికారులు సమగ్రంగా వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, డీఆర్వో బి. చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *