గ్రామాలలో గర్భిణీలకు సాధారణ కాన్పులు ప్రొత్సహించేలా తగిన సూచనలు ఇవ్వాలని తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ కోరారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆరోగ్య, ఆశ కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రజలే అవకాశాలు ఉన్నందున పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించి ఆయా గ్రామాలను క్షున్నంగా పరిశీలించి పంచాయితీ అధికారులకు సమాచారం ఇచ్చి పారిశుధ్యం మెరుగు పడేలా చూడాలని కోరారు. ప్రవేట్ వైద్యశాలలో ఎక్కువగా రిజేరియన్ ఆపరేషన్స్ చేస్తున్నారని తగిన విధంగా మహిళలకు సూచనలు ఇచ్చి ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స పొందే విధంగా ఆపరేషన్స్కు వచ్చే విధంగా చూడాలని చెప్పారు. పలు పథకాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో సీహెచ్ఎ ఏవీ రమణమ్మ, హెచ్ఎన్ రవి కుమార్, పీహెచ్ఎన్ వై విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.
