పచ్చతనము పెంచితే మానవాళిని రక్షిస్తాయి – కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన న్యాయమూర్తులు

మొక్కలను మనం పెంచినట్లయితే అవి వానవాళిని చిరకాలం రక్షిస్తారని సీనియర్ సివిల్ జడ్జి ఎస్ శివ శంకర్ రెడ్డి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా దర్శి కోర్టు ఆవరణలో శనివారం పర్యావరణ పరిరక్షణలో బాగంగా న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జి ఎస్ శివ శంకర్ రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి జె సీత ల ఆధ్వర్యంలో న్యాయ వాదులు, సిబ్బంది మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత, పచ్చదనం ప్రాముఖ్యతను న్యాయమూర్తులు వివరించారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షులు పి ప్రేమ్ కుమార్, కార్యదర్శి ఎన్ సుబ్బా రెడ్డి, సంఘ సేవకులు జీవి రత్నం, పారా లీగల్ వాలంటీర్ కపురం శ్రీనివాస రెడ్డి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *