ప్రధానమంత్రి ఆవాస్ యోజన – 2 (పీ.ఎం.ఏ.యూ – అర్బన్) పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘ అవగాహన – 2025 ‘ పోస్టర్లను జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ సోమవారం గ్రీవెన్స్ హాలులో ఆవిష్కరించారు. ఈ పథకం కింద అర్హులైన వారు పొందేందుకు అవకాశం ఉన్న ప్రయోజనాల వివరాలను వారికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ పోస్టర్లను రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే లబ్ధి పొందిన వారిని కూడా ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నట్లు ఆయన వివరించారు. అర్హులందరూ ఈ పథకం క్రింద ప్రయోజనాన్ని పొందేలా చూడాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయటం, లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా రుణ మేళాలు నిర్వహించటం, పి.ఎం.సూర్యఘర్ – దాని ప్రయోజనాలు కూడా దక్కేలా చూడటం, కొత్తగా నిర్మించిన ఇళ్లలోకి గృహప్రవేశాలు జరిగేలా పర్యవేక్షించడం కోసం ఈ పోస్టర్లను రూపొందించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, హౌసింగ్ పీ.డీ. శ్రీనివాస ప్రసాద్, టిట్కో డి.ఈ.ఈ. వీరబ్రహ్మచారి, సి ఎల్ టి సి ఆనంద్, ఏ.ఈ.ఈ. మల్లికార్జున రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
