రైతులకు నాణ్యమైన ఎరువులు అందించటమే లక్ష్యంగా నిత్యం ఎరువుల దుకాణంలోని బ్యాచ్లను పరిశీలిస్తున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. తూర్పుగంగవరంలో శ్రీ వెంకటేశ్వర, మన గ్రోమోర్ ఫెర్టిలైజర్స్ను సోమవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. యూరియా, డీఏపీ ఎరువులను తీసి విశాఖ పట్నం రీజనల్ కోడింగ్ సెంటర్కు పంపనున్నట్లు తెలిపారు. దుకాణాలలో అవసరమైన అన్ని పత్రాలు నక్రమంగా ఉన్నవా లేవా చూసుకుని దుకాణాదారులు అన్ని పత్రాలను, స్టాకు వివరాలను నిత్యం నక్రమంగా ఉంచుకోవాలని కోరారు.
