2025-26 విద్యాసంవత్సరంలో నూతనంగా ఇంటర్మీడియట్ నుండి పీజీ వరకు చేరిన విద్యార్థులు ఆయా కళాశాల లాగిన్ లో జ్ఞాన భూమి పోర్టల్లో ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డిడి ఎన్ లక్ష్మా నాయక్ కోరారు. జిల్లాలోని అన్ని కళాశాల యాజమాన్యం వారి లాగిన్స్ లో అవకాశం కల్పించినట్లు రెన్యువల్స్, నూతన దరఖాస్తులు ఈనెల 30వ తేది లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు .
