మూడు నెలలుగా మంచి నీటి ట్యాంకులు శుభ్రం చెయ్యకుండా మంచి నీరు ఎలా వదులు తున్నారని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి ప్రశ్నించారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనవాస రావు మాట్లాడూతూ… ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పిన హామిలే కాకుండా చెప్పనవి కూడ సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని అధికారులు కూడ సహకరించి ప్రభుత్వానికి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ ల కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. గ్రామాలలో నివాసాల స్థలాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కొలుస్తూ తప్పుల తడకగా విస్తీర్ణాలు చెబుతున్నారని అందుకు గ్రామాలలో ఇరుగు పొరుగు మధ్య తగాదాలు వచ్చే అవకాశం ఉందని అందుకు తగిన ఉదాహరణతో వివరించారు. క్యాన్సర్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించి సహకరించాలని కోరారు. క్యాన్సర్ నిర్మూలనకు సినీ నటుడు ,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు తాను స్వయంగా చూశానని తగిన ఉదాహరణలతో చెప్పారు. తహసీల్దార్ రమణా రావు చొరవ తీసుకుని విలేజ్ సర్వేయర్లతో విస్తీర్ణాలు కొలిపించాలని కోరారు. ఆర్ డబ్ల్యు ఎన్ ఎఈ వాలి తమ శాఖకు సంబంధించి పురోగతి వివరించు సమయంలో మంచి నీరు పలు గ్రామాలకు సక్రమంగా రావటం లేదని మల్కాపురం నర్పంచి వలి ప్రశ్నించారు. తాళ్లూరుకు నెలకు 15 రోజులుగా ఎందుకు మంచి నీరు రావటం లేదని, అసలు ట్యాంకులు ఎన్ని రోజులకు ఒక సారి శుభ్రం చేస్తున్నారని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి ప్రశ్నించారు. ట్యాంకులను శుభ్రం నెలకు ఒక సారి చెయ్యాలని కాని మూడు నెలలుగా శు భ్రం చేయ్యలేదని ఎఈ చెప్పారు. శుభ్రం చెయ్యని ట్యాంకులలో మంచినీరు ఎలా అందిస్తారని, బ్లీచింగ్ కలిపినా రావటం లేదని, స్థానిక పంచాయితీ ఇతర సిబ్బంది ట్యాంకులలో కలుపుకునేలా చూస్తామని ఎఈ చెప్పటం పై అభ్యంతరం చెప్పారు. అసలు బ్లీచింగ్ నక్రమంగా కలుపక పోవటం, మంచి నీటి సరఫరా తీవ్ర అంతరాయం , పనిచేసే సిబ్బందికి 8 నెలలుగా జీతాలు అందజేయక పోవటం, ఎఈ మండలంలో గ్రీవెన్స్ సెల్ కి సైతం రాకపోవటం, అసలు విధులకు సక్రమంగా హాజరు కాక పోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజా ప్రతినిధులు అంటే కనీసం విలువ లేదా ఫోన్స్ సైతం ఎత్తవు అట మీ విషయాలు పూర్తిగా తెలుసు… జాగ్రత్తగా విధులకు హాజరు కాకుంటే ఇబ్బందులు తప్పవు అని హెచ్చరించారు. వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ …తాళ్లూరుకు 15 రోజులకు ఒక సారి నీరు రావటం లేదని సరియైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీటీసీ ప్రభు దాస్ ఎస్సీలకు పీఎం ఘర్ సోలార్ రూఫ్ ల ను ఎప్పుడు అందిస్తారని అడిగారు. ఎంపీటీసీ బాల కోటయ్య తమ గ్రామంలో మంచినీటి కొలను శుభ్రం చేయించాలని కోరారు. నాగంబొట్ల పాలెం సర్పంచి సుబ్బారావు సబ్ స్టేషన్ పరధిలో లో ఓల్టేజి సమస్యను సభ దృష్టికి తెచ్చారు. నర్పంచి వలి దొంగలించబడిన ట్రాన్స్ ఫార్మర్ల విషయమై రైతులకు న్యాయం చెయ్యాలని కోరారు. ఎంపీడీఓ సానికొమ్ము సత్యం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు ప్రమోషన్ పై మార్కాపురం వెళ్తున్నట్లు చెప్పారు. తహసీల్దార్ బివి రమణా రావు మాట్లాడుతూ… రెవిన్యూ నమస్యలు నిత్యం ఉంటాయని విఆర్ ఓ ల కు తగిన విధంగా పరిశీలించి నిర్ణీత గడువు లోగా
తీర్చాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ పూర్వపు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కేవలం అగ్రిమెంట్స్ పై వ్రానుకున్న వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చెయ్యాలని కోరారు. తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి, వ్యవసాయాధికారి ప్రసాద రావు, మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య, ఎపీఓ వెంకట రావు, ఎపీఎం దేవరాజ్, విద్యుత్, హౌసింగ్, పీఆర్ ఎఈ లు రామక్రిష్ణా రెడ్డి, హనుమంత రావు, వెంకటేశ్వర్లు, హెూమియో పతి వైద్యురాలు శిరీష, ఐసీడీఎన్ సూపర్ వైజర్ ఇందిర తమ శాఖల పురోగతిని వివరించారు. ఆయా శాఖలకు సంబంధించి ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను తెలిపారు. మన్నేపల్లి నర్పంచి మంచాల వెంకటేశ్వర రెడ్డి తమ గ్రామంలో విద్యుత్ స్తంబాలు శిధిలావస్థకు చేరాయని మార్చాలని కోరారు. నాగంబొట్ల పాలెం సొసైటీ చైర్మన్ వల్లభనేని నుబ్బయ్య మాట్లాడుతూ క్యాన్సర్ కు కారణమైన వాటిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, ప్రజా ప్రతినిధులు సైతం గ్రామాలలో చైతన్యం చెయ్యాలని కోరారు.
రాష్ట్ర నాటక రంగ సంస్థ డైరెక్టర్ బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలో పాఠశాలకు వెళ్లు రోడ్డు అధ్వాన్నంగా ఉందని సీసీ రోడ్లు మంజూరు అయిన అందుకు మంజూరు అయిన సిమెంట్ను పంచాయితీ రాజ్ ఎఈ గతంలో ఉన్న కాంట్రాక్టర్ వద్ద నుండి ఇప్పించటానికి ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారని తెలిపాలని కోరారు. పది రోజులలో సమస్యను పరిష్కరిస్తానని పీఆర్ ఎఈ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. మన్నేపల్లి సొసైటీ చైర్మన్ గొంది రమణారెడ్డి ( సమర) తదితరులు పాల్గొన్నారు.



