ఒంగోలు పట్టణంలోని కర్నూల్ రోడ్లోని హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ ఆధ్వర్యంలో హనుమాన్ ఫిల్లింగ్ స్టేషన్ (ఐఓసీ) నూతన ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి లతో పాటు ముఖ్య అతిథులుగా ఒంగోలు, నంతనూతల పాడు ఎమ్మెల్యే లు దామచర్ల జనార్ధన్, బిఎన్ విజయ కుమార్, ఎపీ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, నగర మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు అర్బన్ డెవలప్ మెంట్ అధారిటి చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు మార్కేట్ కమిటీ చైర్మన్ రాచగొర్ల వెంకట రావు, టిడిపి ముఖ్య నాయకులు మంత్రి శ్రీనివాస రావు, మండువ మురళీ క్రిష్ణ ముఖ్య అతిథిలు గా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఒంగోలు మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు, హర్షిణి విద్యాసంస్థల ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





