ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన తమిళ నాడు బృందం పర్యటన- 33 మంది సభ్యుల బృందం పర్యటన – రెండు బృందాలుగా ఏర్పడి పలు చోట్ల ప్రకృతి వ్యవసాయం, ఎటీఎం మోడల్స్ పరిశీలన

ఎపీలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని తమిళ నాడు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ కు చెందిన సభ్యుల బృందం మూడు రోజుల పాటు ఎపీ రాష్ట్ర సాధికారిత సంస్థ అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించనుంది.
అందులో బాగంగా మొదటి రోజు జిల్లాలో బృందాలుగా ఏర్పడి ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మెనేజర్ సుభాషిని ఆధ్వర్యంలో పర్యటించారు. మొదటి బృందం కొత్త పట్నం మండలం రంగాయ పాలెం గ్రామంలో ఆరోగ్య, పోషణ విభాగాలను పరిశీలించారు. కాటా సురేంద్ర ఎటీ ఎం ఎ గ్రెడ్ వేరు శనగ, నాగరాజు ఫ్రీ మాన్ సూన్ డ్రై సోయింగ్, మల్లేశ్వరి బయో రిసోర్స్ సెంటర్లో విత్తన గుళికలు ఘన, ద్రవ జీవామృత తయారీ ప్రదర్శనలు పరిశీలించారు.
రెండవ బృందం ఈత ముక్కల గ్రామంలో అంగన్ వాడీ కేంద్రంలో పోషణ కార్యక్రమాన్ని పరిశీలించారు. వజ్జి రెడ్డి పాలెంలో శ్రీహరి రెడ్డి సాగు చేసిన మాన్ సూన్ డ్రై సోయింగ్, వే రాఘవ రెడ్డి ఎన్ టైం మనీ మోడల్స్ను పరిశీలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆరోగ్య, పోషణ, ఇంటర్నల్ కమ్యునిటి రిసోర్స్ పర్సన్, రైతలు, హెల్త్,న్యూట్రిషన్ ఫెలోస్, స్వయం సహాయక బృందాలతో చర్చలు జరిపోరు. పంటల ఎంపిక, మల్టీ లేయర్ డిజైన్స్, ప్రకృతి వ్యవసాయ జీవ ఉత్తేర కాల వినియోగం, కీటక వ్యాధుల నియంత్రణ పై అవగాహన పొందారు. ప్రత్యేకంగా రసాయన రహిత కూరగాయల ప్రాధాన్యం, న్యూట్రీ గార్డెన్స్ గ్రామ స్థాయిలో ఆహార, పోషక భద్రత దోహం చేసే విధానాలపై చర్చించారు. ఈ పర్యటనలో తమిళ నాడు బృందం సభ్యులు 33 మంది తో పాటు ఆర్ వై ఎస్ ఎన్ స్టేట్ ఆఫీస్ నుండి హుమయూన్, క్రిష్ణా రావు, దాదా పీర్ . శ్రీ లేఖ జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు, అంగన్ వాడీ, పొదుపు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *