భారత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణం రాష్ట్ర ప్రభుత్వ
సూచనల మేరకు వికసిత్ భారత్ 2047 కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు స్టెఫ్ సీఈఓ పి శ్రీమన్నారాయణ తెలిపారు. బుధవారం నుండి ఈనెల 23 వరకు స్టెప్, విద్యాశాఖ సంయుక్తగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించి పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి కిరణకుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. వికసిత్ భారత్ 2047 కార్యక్రమంపై అవగాహన కల్పించారు. గురువారం ఒంగోలు ఆంధ్ర కేసరి విద్యా కేంద్రంలో వర్క్ షాప్ నిర్వహించబడునని స్టెప్ సీఈఓ పి శ్రీమన్నారాయణ తెలిపారు.

