భారత సంచార నిగమ్ లిమిటెట్ ( బి ఎస్ ఎన్ ఎల్) ఫైబర్ నెట్ సేవలను తాళ్లూరు మండల కేంద్రంలో తిరిగి గురువారం ఎట్టకేలకు అందించారు. జే ఎస్ డి ఎం న్యూస్ లో ‘బి ఎస్ ఎన్ ఎల్ ప్రకటనలు ఫుట్ సేవలు నిల్ ‘ కార్యక్రమానికి బి ఎస్ ఎన్ ఎల్ అధికారులు స్పందించారు. సంబంధిత సిబ్బంది
ని గురువారం ఉదయం నుండి క్షేత్ర స్థాయికి పంపి వినియోగదారుల సెట్ అఫ్ బాక్స్, ఫైబర్ తీగలలో లోపాలను సరిచేయించారు. దర్శి బిఎస్ ఎన్ ఎల్ జెఈ రత్న రాజు రీ కనెక్షన్ అయ్యేంత వరకు వినియోగదారులతో మాట్లాడి వారిని సంతృప్త పరచారు. ఇకపై సేవలు మరింత వేగంగా అందేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా ఫైబర్ నెట్ సేవలను తిరిగి ఇప్పించిన బిఎస్ ఎన్ ఎల్ అధికారులకు సమస్యను తెలియజేసిన జే ఎస్ డి ఎం న్యూస్
కు వినియోగదారులు కృతజ్ఞతలు తెలిపారు.
