బాల బాలికల హక్కులపై అవగాహన కలిగి ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ సువర్ణ కోరారు. పేర్నమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ పీడీ సువర్ణ మాట్లాడుతూ… ఆరు నుండి 18 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు అభివృద్ధి, రక్షణ సాధికారిత అందించటమే లక్ష్యంగా ఐసీడీఎస్ పనిచేస్తుందని తెలిపారు. బాలలకు నాయకత్వ లక్షణాలు పెంపొందిచటంతో పాటు బాల్య వివాహాల అడ్డుకోవటం, ఆరోగ్యం, విద్య, పోషణ, నైపుణ్యాల భద్రత మరియు ఉపాధి అవకాశాలు కల్పించటం లాంటి ముఖ్య లక్ష్యాలను చేరుకోవటానికి ఐసీడీఎస్ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్ మాట్లాడుతూ ..బాలల హక్కులకు భంగం వాటిల్లి నట్లయితే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్ 1098,112,181 మరియు 100 నంబర్లు ఉపయోగించుకోవాలని కోరారు. చిన నాటి నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకుని సాధించటానకి కృషిచెయ్యాలని కోరారు. పెద్దలను, గురువులను, మహిళలను గౌరవించటం చిన నాటి నుండే అలవాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కుమారి ఐసీడీఎస్ సూపర్ వైజర్ రామ, కౌల్సిలర్ కుమార్ అవుట్ రిచ్ వర్కర్ శామ్యూల్ రాజ్ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
