జోరు వాన పొంగిన వాగులు – వంకలు – దోర్నపు వాగు వద్ద పోలీసులు కాపలా – మల్కాపురం పంచాయితీలో విధులకు వెళ్లలేక ఆగిన ఉద్యోగులు

గత రెండు రోజుల నుండి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండ సాయంత్రం వేళ
జోరు వర్షం కురుస్తుండటంతో పాటు ఎగువ మండలాలలో సైతం అధిక వర్షంతో దోర్నపు వాగు పొంగింది. దీంతో మండలంలోని తోట వెంగన్న పాలెం, తాళ్లూరు – విఠలాపురం. తాళ్లూరు – మల్కాపురం మధ్య దోర్నపు వాగు బ్రిడ్జిల పైకి ప్రమాదకర స్థితిలో నీరు రావటంతో ఆయా గ్రామాల మధ్య రాక పోకలు బంద్ అయ్యాయి. దీంతో ఆయా గ్రామాల వాగు వద్ద ఎస్సై మల్లిఖార్జున రావు పోలీన్ సిబ్బంది బాబు రావు, శ్రీనివాన్, మాల కొండయ్యలను నియమించి రాక పోకలు నియంత్రించారు. ప్రమాదకర పరిస్థితిలలో వాగులలో దిగవద్దని కోరారు. రజానగరం వద్ద వాగు పొంగటంతో మల్కాపురం నచివాలయానికి ఉద్యోగాల రీత్యా వెళ్లాల్సిన పలువురు సచివాలయ సిబ్బంది వెళ్లలేని పరిస్థితి రావటంతో వాగు పరిస్థితిని ఎంపీడీఓ సానికొమ్ము సత్యం వెళ్లి పరిశీలించారు. మండలంలో గురువారం 28 మి.మీల మేర వర్షపాతం నమోదు అయినట్లు తహసీల్దార్ బివి రమణా రావు తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల బన్సులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆయా గ్రామాలకు విద్యార్థులను చేర్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *