తాళ్లూరు మండల స్థాయి (ఎసీఎఫ్ ) ఆటల పోటీలు శుక్రవారం తూర్పుగంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైనారు. మండల విద్యాశాఖాకారి -1 జి సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర్ రావు క్లస్టర్ చైర్మన్ వైఎస్ ఆర్ కే ప్రసాద్, కమిటీ చైర్మన్ షంషాద్ బేగమ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆటల పోటీలు ప్రారంభించారు. ఎంఈఓ-1, క్లస్టర్ చైర్మన్, హెచ్ఎం కబడ్డీ ఆడి పోటీలను ప్రారంభించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. మండల స్థాయిలో ఎన్టీఎఫ్ గెమ్స్ లో ప్రతిభ చాటిన విద్యార్థులు జిల్లా స్థాయికి పంపటం జరుగుతుందని అన్నారు.

