తాళ్లూరు మండలం లోని తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్
ఆధ్వర్యంలో శుక్రవారం బొద్దికూరపాడులో స్వర్త్ నారీ నస్త పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచి మందా శ్యామ్సన్, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్య, రమణా రెడ్డిలు ముఖ్య అతిధులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి స్త్రీలు ఎదుర్కోంటున్న ఆరోగ్య సమస్యలు అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. 156 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. హెచ్ఐఓ చంద్రశేఖర్, పీహెచ్ ఎన్ రమణమ్మ, హెచ్పీ సుశీల, ఆరోగ్య, ఆశ, 104 సిబ్బంది పాల్గొన్నారు.



