స్మార్ట్ రేషన్ కార్డులతో రేషన్ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని వక్తలు అన్నారు. తాళ్లూరు లో శనివారం స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ కెవీ రమణా రావు
మాట్లాడుతూ …మండలంలో 32 రేషన్ దుకాణాల పరిధిలో 14,115 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. సాంకేతికతో కూడిన స్మార్ట్ కార్డుల వినియోగం వలన లబ్దిదారులకు మరింత మెరుగైన సేవలు అందననున్నట్లు చెప్పారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, పార్టీ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ బాబు, రాష్ట్ర నాటక రంగ డైరెక్టర్ బి ఓబులు రెడ్డి, విఆర చంద్రశేఖర్, డీలర్లు మాగంటి శ్రీనివాస తదితరులు పాల్గొని స్మార్ట్ కార్డులను పంపిణీ చేసారు.
