వైద్యశాఖ ఆధ్వర్యంలో సి పి ఆర్ ఫై అవగాహన

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలు లో జిల్లా కలెక్టరు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో సిపిఆర్ పై అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఒక వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలినట్లైతే ఏ విధంగా పక్కనే ఉన్న వాళ్ళు స్పందించి హై క్వాలిటీ సిపిఆర్ పద్ధతి ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చు అని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది.
మాక్ డ్రిల్ లో భాగంగా కోటి అనే వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోగా వెంటనే అక్కడ ఉన్న ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ డా హేమంత్ స్పందించి సిపిఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేసన్ ) చేసి ఆ వ్యక్తిని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించడం జరిగినది .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా డీసిహెస్ డా.సూరిబాబు, డీఎం అండ్ హెచ్ఓ డా.వెంకటేశ్వర్లు సిపిఆర్ చేయాల్సిన పద్దతిని పాటించవలసిన జాగ్రత్తలు, సిపిఆర్ సమయంలో చేయకూడని పనుల గురించి వివరిస్తూ ఉండగా డా. హేమంత్ మానేక్విన్ మీద మాక్ డ్రిల్ రూపంలో లైవ్ డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది. సిపిఆర్ గురించి ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని, ఒక వ్యక్తి గుండె ఆగిపోయి అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు సిపిఆర్ మాత్రమే రక్తప్రసరణ తిరిగి అవయవాలకు అందించి ప్రాణాలను రక్షించే మార్గమని , ప్రతీ ఒక్కరూ సిపిఆర్ టెక్నిక్ ను నేర్చుకొని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేయాలని డా.వెంకటేశ్వర్లు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు,జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ శ్రీమన్నారాయణ , జిల్లా అధికారులు , అర్జీదారులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *