తాళ్లూరు మండలంలోని రెడ్డి సాగర్ వద్ద ఓబీసీ కెనాల్ చేపల వేట చేస్తున్న వ్యక్తి గల్లంతయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… పొదిలి మండలం కాటూరి వారి పాలెం కు చెందిన వ్యక్తి మెలిక ప్రసాదు (43) సంవత్సరాలు అను వ్యక్తి గత రెండు రోజుల నుండి రెడ్డి సాగర్ వద్ద సాగర్ కెనాల్ లో చేపల వేట సాగిస్తున్నాడు. అయితే మంగళవారం చేపలు పడిన వలను తీయటానికి ప్రయత్నిస్తున్న సమయంలో వల్ల కాళ్లకు చుట్టుకొని కనిపించకుండా పోయాడు. దీంతో గమనించిన కొండమ్మ సమీపంలో వేట సాగిస్తున్న విజయ్ కుమార్ కు తెలపడంతో ఆయన చుట్టుపక్కల రైతు లు కలసి ఎంత వెతికినా కనిపించలేదు. వి. ఆర్ ఓ చిన్ని కృష్ణయ్య సమాచారాన్ని తహసిల్దార్ రమణారావు, ఎస్సై మల్లికార్జున్ లకు అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రసాద్ కు భార్య సుజాత ఇరువురి కుమారులు, కుమార్తె ఉన్నారు.



