పేదలకు అండగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ – ప్రకాశం జిల్లా మానవత సంస్థ ప్రధాన కార్యదర్శి.

అన్ని వర్గాలకు చెందిన పేదలకు అండగా మానవతా స్వచ్ఛంద సంస్థ సేవలు చేయడం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి అన్నారు.
“గడపగడపకూ మానవత సంస్థ” అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మంగళవారం కురిచేడులో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లడుతూ…, మానవత సంస్థ మహోన్నతమైన విలవలు,ఆశయాలు కలిగిన సంస్థని,సమాజంలో ఎవరూ చేయలేని మహోన్నత కార్యక్రమాల ను చేస్తుందని,రాష్ట్రంలో 141 కేంద్రాలతో, 97 వేలమంది సభ్యుల తో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా సేవజేస్తున్నారని, మానవత సంస్థకు అందరూ సహకరించాలని కపురం శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా అభ్యర్థించారు. ఈ కార్యాక్రమంలో దరిశి మానవత సంస్థ ప్రతినిధులు దేవతి వర ప్రసాదు, ధనిరెడ్డి వెంకటరెడ్డి,చీదెళ్ళ.బసవయ్య,రోషశారావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *