జూబ్లీహిల్స్ అక్టోబర్ 29
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సినీ కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ఈ ఎస్ ఐ సదుపాయం కల్పించాలని సామాజిక కార్యకర్త పుట్టా రామకృష్ణ అన్నారు.తెలుగు సినీ పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్లలో 25,000 మందికి పైగా సినీ కార్మికులు ప్రతిరోజూ రోజువారీ జీతాలపై కష్టపడి పనిచేస్తున్నారు. వీరికి స్థిరమైన ఉపాధి లేకపోవడంతో పాటు ఆరోగ్య భద్రతా సదుపాయాల లోపం తీవ్రంగా ఉందన్నారు.
సినీ కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ESI (Employee State Insurance) సదుపాయం కల్పించాలని సామాజిక కార్యకర్త పుట్టా రామకృష్ణ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.సినీ కార్మికులు కేవలం తెరమీద కనిపించే నటులే కాదు. లైటింగ్, కేమరా, మేకప్, కాస్ట్యూమ్, సెట్ డిజైన్, ఎడిటింగ్ వంటి విభాగాల్లో వేలమంది చెమటోడ్చి సినిమాలనునిలబెడుతున్నారువారికి ప్రభుత్వం ESI సదుపాయం కల్పిస్తే, వారికీ వారి కుటుంబాలకూ భద్రత లభిస్తుంది” అని పుట్టా రామకృష్ణ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా విజ్ఞప్తి చేసారు.
