దొనకొండను పారిశ్రామికప్రగతికి సహకారం అందించాలి -ఎం చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గురువారం గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలుసుకొని తుఫాన్ నష్ట నివారణ చర్యలు రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి అవసరమైన నిధులు తదితర అంశాలపై చర్చించారు.
దర్శి నియోజకవర్గంలోని ఎనుకబడిన దొనకొండ ప్రాంతంలో ఆర్డీఎస్ పరిశ్రమను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.వెనుకబడిన దొనకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది మంచి అవకాశంగా మన కూటమి ప్రభుత్వంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తీసుకున్న చొరవకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దొనకొండ లో వలసలు నివారించేందుకు ఇది ఎంతో మేలు చేస్తుంది అన్నారు.
యుద్ధ ఆయుధాలకు అవసరమైన సామాగ్రిని తయారు చేసే పరిశ్రమను దొనకొండలో స్థాపించడం మాకు ఎంతో ఆనందదాయకమన్నారు.
అదేవిధంగా దర్శి పట్టణంలో డిగ్రీ కాలేజీ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు కు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
అదేవిధంగా ఇటీవల తుఫాన్ బీభత్సానికి దర్శి ప్రాంతంలో జరిగిన పంట నష్టం, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల నష్టాలపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేశారు. కూటమి 18 నెలల పాలనపై ప్రజలలో ఉన్న ఆనందాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా మీరు ప్రజల పక్షాన ప్రజల్లో ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *