ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, మూడవ రోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా స్కూల్ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు, వ్యాన్లు మరియు ఇతర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 33 టీమ్‌లు ఏర్పాటుచేసి 2,044 వాహనాలను తనిఖీ చేశారు.
సరైన పత్రాలు లేని వాహనాలు మరియు ఇతర నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 213 వాహనాలను గుర్తించి వాటికి ఈ చలానా ద్వారా రూ.1,56,275 జరిమానా విధించచారు.
గురువారం ఉదయం నుండి 33 టీంలతో పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ప్రతి పత్రాలను పరిశీలించారు. ప్రత్యేకంగా ప్రతి స్కూల్ బస్సులో డ్రైవర్స్‌తో పాటు విద్యార్థులకు కూడా రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.
డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవింగ్‌పై పూర్తి దృష్టి పెట్టకపోవడం, ఇక్కడక్కడ దృష్టి మళ్లించడం వలననే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసు సిబ్బంది విద్యార్థులకు వివరించారు.
అలాగే, మీ తండ్రి లేదా పెద్దవారు వాహనం నడుపుతున్న సమయంలో వారిని మాట్లాడించడం, దృష్టి మళ్లించడం వంటివి చేయకూడదని, డ్రైవింగ్ సమయంలో వాహనం నడుపుతున్న వ్యక్తి పట్ల వెనుక కూర్చున్నవారికి కూడా బాధ్యత ఉందని పోలీసులు విద్యార్థులకు తెలియజేశారు.
డ్రైవింగ్ చేస్తున్నారులే… వాళ్ళు ఎటు చూస్తే… మనకేందుకులే అనుకుంటే మనతోపాటు రోడ్డు మీద వెళ్ళుతున్న ఇతర వాహన చోదకులు తీవ్రంగా నష్టపోతామని పోలీసు సిబ్బంది విద్యార్థులకు వివరించారు.
డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు కొద్దిపాటి నిర్లక్ష్యం వల్లన ఎదైన యాక్సిడెంట్ జరిగితే.. ఆ కుటుంబం రోడ్డున పడుతుందని విద్యార్థులకు గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల పై విద్యార్థి దశ నుండి నేర్చుకుంటే… వచ్చే తరం ట్రాఫిక్ రూల్స్ తోపాటు వేగనియంత్రణ పై అవగాహన ఉంటుందన్నారు.
ఇదిలా ఉంటే ప్రతి వాహనంలో కచ్చితంగా గాజు బ్రేకర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు వంటివి పని ఉండాలని బస్సు డ్రైవర్స్ కు సూచించారు. అలా పరికరాలు లేని వాహన డ్రైవర్స్ కు వాటి వల్లన కలిగే ఉపయోగాలను వివరించి కొనుగోలు చేయాలని ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ కొత్తగా వాహనం కొనుగోలు చేసిన సమయంలో కంపెనీ ఇచ్చిన సేఫ్టీ మెథడ్స్ వాహనంలో పెట్టుకోవడం వల్లన ఎదైన ప్రమాదం జరిగితే వేంటనే ఫస్ట్ ఎయిడ్ చేసుకునే అవకాశం ఉంటున్నారు. ఇలాంటి పరికరాలు లేని వాహనాలను మొదటి తప్పు గా విడిచి పెడితున్నామని.. మరోసారి కనిపిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
మోటార్ వాహన చట్టం నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

