పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయనున్న పరీక్షా కేంద్రాలను డిప్యూటీ డీఈవో చంద్రమౌళేశ్వరరావు గురువారం పరీశీలించారు. మం డలంలోని తాళ్లూరు వి. కె. ఉన్నత పాఠశాల, శ్రీ సరస్వతీ హైస్కూల్, తూర్పుగంగవరం, బొద్దికూరపాడు, జడ్పీహైస్కూల్ , అమెరికా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాలు పరీక్షల నిర్వహణకు అనువుగా వున్నవా వసతులు ఏవిధంగా వున్నాయి. విద్యారుల సరిపడా గదులు, వంటి అంశాలను పరిశీలించారు. ఆయా పాఠశాలల రికార్డులను, విద్యార్థుల, ఉపాధ్యాయుల హజరుశాతాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయ ల నియామకం జరిగినందును పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోఎంఈవోలు జి.సుబ్బయ్య, ఎల్. సుధాకర్ రావు, హెచ్ఎంలు వైఎస్ఆర్ కెప్రసాద్, వి.శ్రీరామ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

