తాళ్లూరు మండలంలోని తూర్పుగంవరం జెడ్పీ ఉన్నత పాఠశాలను సివిల్ సప్లయర్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మండల ప్రత్యేక అధికారి ఎ కుమార్, ఎంపీడీఓ పి అజిత లు పాఠశాలను అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో మౌళిక వసతులను, పాఠశాలలో విద్యార్థుల బోధన ను పరిశీలించారు. విద్యార్థులతో కలసి మధ్యాహ్నభోజనం చేసారు. మినరల్ వాటర్ ప్లాంట్ కూడ పని చేస్తుండం, బోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసారు. మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర్ రావు, పాఠశాల హెచ్ఎం వైఎస్ఆర్ కే ప్రసాద్ (కన్నయ్య మాస్టార్) తదితరులు పాల్గొన్నారు.
