పార్టీ పట్ల అంకితభావం, సేవా తత్వం ఉన్న వ్యక్తులనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిపించుకోవాలీ ….టి పి సి సి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండిరమేష్.

బేగంపేట డిసెంబర్ 30
(జే ఎస్ డి ఎం న్యూస్) :
పార్టీ పట్ల అంకిత భావం,పేద ప్రజల పట్ల సేవా తత్వం ఉన్న వారినే రానున్న జీ హెచ్ ఎం సి ఎన్నికల్లో కార్పొరేటర్లు గా గెలిపించాలని టి.పి.సి.సి.ఉపాధ్యక్షుడు,
కూకట్ పల్లి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పిలుపు నిచ్చారు.
బుధవారం నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరపల్లి రమేష్ ,విశాల్ సుధాం
స్థానిక నాయకులతో కలిసి సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. తన దృష్టికి వచ్చిన వాటర్ డ్రైనేజీ వంటి సమస్యలపై అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు .డివిజన్ లు చిన్నవి కావడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయని అధికారులు అందుబాటులో ఉంటారని రమేష్ పేర్కొన్నారు .తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు చూసి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని తద్వారా ప్రజల్లో సానుకూలత పెరుగుతోందన్నారు.స్థానికంగా ఉన్న సమస్యలపై అధికారులు ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహించి వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య ,హాజీ టోచర్, విశాల్ సుధాం ,నర్సింగ్,రమాదేవి ,
దర్గా కరుణాకర్, ఎరుకల సురేష్,భరత్, పర్వీజ్ ,,అలీ మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *