కూటమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి అర్హడికి చేరాలన్నదే టిడిపి ఇన్చార్జి డాక్టర్ గోట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ల లక్ష్యమని వక్తలు అన్నారు. తాళ్లూరు మండలంలో ఎన్ టిఆర్ ఆర్ భరోసా పెన్షన్లు బుధవారం పంపిణీ చేసారు. ఆయా పంపిణీలలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తాళ్లూరులో వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, ఇడమకంటి శ్రీనివాస రెడ్డిలు పాల్గొని పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. శివరామపురంలో డీఎల్డీఓ నువార్త, ఎంపీడీఓ అజిత, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావులు పాల్గొని పెన్షన్లు పంపిణీ చేసారు. మండలంలో మొత్తం 6149 పలు రకాల పెన్షన్లు ఉండగా అందులో 89శాతం వరకు పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు.
