మండల కేంద్రమైన తాళ్లూరులో బుధవారం జరిగిన భూ రీసర్వే అవగాహన సదస్సుకు రైతాంగం కేవలం 5 గురుమాత్రమే హజరయ్యారు. దీంతో సభకు హజరైన జడ్పీటీసీ మారంవెంకటరెడ్డి రెవెన్యూ అధికారుల బాధ్యతా రాహిత్యంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. తాళ్లూరు-1 సచివాలయం వద్ద తాళ్లూరు1,-2సచివాలయాల
పరిది లోని రైతులకుఅవగాహన సదస్సు బుధవారం జరిగింది. ఈసందర్భంగా మాట్లాడుతూ గతంలో జరిగినరీసర్వేలో తప్పులు దొర్లి రైతాంగం తీవ్రఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వం రీసర్వే గ్రామాల్లో రైతాంగంను సభలకు పిలిచి అవగాహన కల్గించాలని చెబుతున్నా ఎందుకు అధికారులు నిర్యక్ష్యం వహిస్తున్నారన్నారు. గ్రామాల్లో రైతాంగానికి ముందస్తు సమచారం ఇవ్వనందునే రైతాంగం సదస్సుకు దూరంగా వున్నారన్నారు. ప్రజా ప్రతినిధులకు తగు గౌరవం ఇ వ్వటం లేదని రెవెన్యూ సిబ్బం దిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సుకు కేవలం 5గురు రైతులు వచ్చారంటే రైతులకు సమాచారం ఎవిధంగా ఇచ్చారో అర్థమవుతుందన్నారు. ఇలాంటి సదస్సులకు రైతాంగం అధికంగా వచ్చేలా చూడాలని, రైతాంగానికి అవగాహన వుంటూ రీసర్వే తప్పులు జరుగకుండా వుంటాయన్నారు. ఈకార్యక్రమంలో వైస్ఎంపీపీ ఐ. వెంకటేశ్వరరెడ్డి, జి.వేణుబాబు, మండల సర్వేయర్ మహేష్ బాబు, రీసర్వేడీటీ ప్రశాంత్. ఆర్ ఐ సుధీర్ కుమార్, సచివాలయ సిబ్బంది దాదాపు 10మందికి పైగా వుండగా రైతులు పట్టుమంది రెండంకెల సంకెలో హజరుకాక పోవటం చర్చనీయం అయినది.
