శివరామపురంలో నర్పంచి, గతంలో పనిచేసిన గ్రామ కార్యదర్శి అక్రమంగా నిధులు దుర్వినియోగంపై ఉప సర్పంచి నారిపెద్ది రామ్మూర్తి ఫిర్యాదు మేరకు డీఎల్డీఓ నువార్త పాల్గొని విచారించారు. రామ్మూర్తి విచారణపై గతంలో ఒకసారి విచారణ చేయగా అప్పట్లో సర్పంచి హాజరు కాలేదు. దీంతో వాయిదా వేసారు. మరలా బుధవారం విచారణ నిర్వహించటానికి డీఎల్డీఓ, ఎంపీడీఓ అజితలు రాగా సర్పంచి వర్గీయులు గైర్హాజరు కావటంతో మరలా వాయిదా వేసి వెళ్లారు.
