నూతన సంవత్సరం సందర్భంగా దర్శి పట్టణం, లంకోజనపల్లి రోడ్డు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అభిమానులు ఘనంగా ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , కడియాల రమేష్ దర్శి పట్టణంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు . సందర్భంగా ప్రజానీకానుద్దేశించి దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ దర్శి ప్రజల హృదయాలలో నాకు సముచిత స్థానం ఇచ్చినందుకు మీ అభిమానిగా మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
మీలో ఒకరిగా మీకు ఏ కష్టం వచ్చినా నేనుంటాను. మీ అండగా ఉంటాను. మీ కుటుంబ లొ ఒకరిగా ఉండి మీ విశ్వాసాన్ని నిలబెడతాను. ఎన్నికలకు నెల ముందు వచ్చాను అయినా మీరు మీ ఆడబిడ్డ వలె మీ కుటుంబ బిడ్డ వలె నన్ను ఆదరించారు. ఇచ్చిన మాట ప్రకారం నేను మీ మధ్య ఉంటూ దర్శి అభివృద్ధి బాధ్యత తీసుకున్నాను.
గొట్టిపాటి వారసురాలుగా 45 ఏళ్లు మా కుటుంబం రాజకీయాల్లో ఉంది ప్రజాసేవ తప్ప మాకు అవినీతి తెలియదు, అక్రమాలు చేయడం రాదు మమ్మల్ని నమ్మి ఓట్లేసిన లక్ష మంది ఓటర్లకు మేము జవాబు దారిగా మీ సమస్యలకు మేము బాధ్యత వహిస్తూ ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళుతున్నాము.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 18 నెలల కాలంలో దర్శి నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా వదిలేసి నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా ఉన్న అనేక ప్రాజెక్టులను మనం ముందుకు తీసుకు వెళుతున్నాం. నగరపాలక సంస్థగా ఉన్న దర్శి పట్టణాన్ని గ్రేడ్-2 మున్సిపాలిటీగా మార్చుకోగలిగాం. దర్శిని సుందరంగా తీర్చిదిద్దే దిశగా మన అభివృద్ధి సాగుతుంది. ప్రతి వార్డులో రోడ్లను, ట్రైన్లను పూర్తి చేస్తున్నాం. మౌలిక సదుపాయాలు కల్పన ధ్యేయంగా నిరంతర తాగునీటి వసతి అందించే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అన్నా కాంటీన్ ను పూర్తి చేసాం, దర్శిలో డిగ్రీ కాలేజీ కి పక్కా భవనాల నిర్మాణానికి కృషి జరుగుతుంది. ఆర్టీసీ డిపో నిర్మాణానికి ప్రయత్నిస్తున్నాను, టిటిడి కళ్యాణమండపం దాతల విరాళాలతో ఆనాడు వైసిపి నిర్లక్ష్యంగా వదిలేస్తే తిరిగి మనం పనులు ప్రారంభించాం. అదేవిధంగా కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేపట్టబోతున్నాం, మినీ స్టేడియం, పార్కుల సుందరీ కరణ ఇలా దర్శి రూపురేఖలు మార్చే దిశగా దాదాపు 5కోట్లతో రోడ్లు,డ్రైన్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాక గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ తిరిగి ప్రారంభమయ్యే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పటికే ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , రావాణా శాఖామంత్రి రాంప్రసాద్ రెడ్డి , ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ ఈ మేరకు హామీ ఇచ్చినట్లు కూడా డాక్టర్ లక్ష్మీ వివరించారు. దొనకొండ దశ దిశ మార్చే విధంగా, వలసలు లేని దొనకొండను చూసే లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధి దొనకొండలో పరుగులు తీయబోతుంది. సోలార్ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. ఆయుధాల తయారీ కంపెనీ దొనకొండకు రాబోతుంది ఇలా ఉపాధి లక్ష్యంగా వలసలు లేని దొనకొండను చూడాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నానని డాక్టర్ లక్ష్మీ తెలిపారు . అదేవిధంగా తాళ్లూరులో మొగిలిగుండం ప్రాజెక్టు పూర్తయి జలకళ కనిపిస్తుంది అన్నారు. సాగర్ కాలువలలో సాగునీటిని సక్రమంగా అందించగలిగాం రైతులు అండగా ఉండగలిగా. రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే నేనుండి టమాటాలు రైతు బజార్లో అమ్మించాను. పొగాకు రైతులకు న్యాయం చేసాము. 132 కెవి సబ్ స్టేషన్ ను తాళ్లూరులో ఏర్పాటు చేసుకున్నాం.
అదేవిధంగా కురిచేడులో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాం. ఇక గ్రామాలలో రోడ్ల నిర్మాణం కు దాదాపు 20 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. జాబ్ మేళాలు నిర్వహించాం. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నిరంతరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ఆదర్శంగా తీసుకొని అదే స్ఫూర్తితో దర్శిని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మీ అందరి ఆదరాభిమానాలతో నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి ఆమె హామీ ఇచ్చారు.
అదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వాన్ని మరికొంత కాలం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అధికారంలో ఉంచేందుకు అందరూ ప్రజలందరూ దీవించాలని ఆదరించాలని కోరారు . మతాల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టి సాంకేతికంగా దర్శిలో మనం ఓటమి చూసాం. తిరిగి తెలుగుదేశం జెండా ఎగురవేసే వరకు ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని డాక్టర్ లక్ష్మీ పిలుపునిచ్చారు. మీరు చూస్తున్నారు మేము పడుతున్న కష్టం ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటున్నాం ఓడిపోయామని పారిపోలేదు మమ్మలను హేళన చేసిన వారు ఇప్పుడు ఏం మాట్లాడతారు.
మేము వైద్య వృత్తిలో బిజీగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్టాలు తీర్చే బాధ్యత తీసుకున్నాము.
నేను, నా భర్త లలిత్ ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటున్నాం. వారంలో ఐదు రోజులు మీతో ఉంటూ మీకే కష్టం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా మేము మీ కుటుంబ సభ్యులు వలే మీతో ఉంటున్నాం. ఆనాడు తుఫాను సమయంలో మీ కండగా ఉన్నాం. మీతో పాటు నేను కష్టపడ్డాను చెట్లు తొలగించాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు భరోసాగా నిలిచాము. దీనిని బట్టి మీకు అర్థమవుతుంది గొట్టిపాటి కుటుంబం ఇచ్చిన మాట ప్రకారం ఎలా కట్టుబడి ఉంటుందో మీరు ఈ 18 నెలల కాలంలో నాపై చూపిన అభిమానాన్ని ఆప్యాయతను నేను మర్చిపోను. అందుకే మరింత బాధ్యతగా 2026 లో దర్శి రూపురేఖలు మార్చే దిశగా నా కృషి అధికంగా ఉంటుందని మాట ఇస్తున్నానని అన్నారు . నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు విచ్చేసిన అశేష జనవాహినికి, అధికార యంత్రాంగానికి, టిడిపి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కుటుంబ సభ్యులకు, కూటమినేతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని , కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు .
కార్యక్రమం దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దర్శి సొసైటీ బ్యాంక్ చైర్మన్ శేఖర్ పంతులు, దర్శి నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, పిడతల నెమిలయ్య, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వర రెడ్డి, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్నా, నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, అధికారులు, మహిళలు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


