నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు.సిటీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమీషనర్ జోయల్ డేవిస్.

హైదరాబాద్, (జేఎస్ డి. ఎం న్యూస్) :
వాహనాల నంబర్ ప్లేట్లను మార్చడం లేదాట్యాంపరింగ్‌కు పాల్పడటం తీవ్రమైన నేరమని, అటువంటి వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ హెచ్చరించారు.
నంబర్ ప్లేట్ మార్చి ఇతర వాహనదారుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఒక వ్యక్తిని చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మలక్‌పేటకు చెందిన సయ్యద్ అలీవుద్దీన్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం అసలు నంబర్ టి ఎస్ 11ఈ జడ్ 2936 ను కావాలనే టి ఎస్ 11 ఈ జడ్ 2836 గా మార్చి వాడుతున్నాడనీ, ఈ క్రమంలో అసలైన వాహన యజమాని ఫహీమ్ అలీ, తన వాహనంపై వరుసగా ట్రాఫిక్ చలాన్లు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడిందన్నారు. నిందితుడు చేసిన ఉల్లంఘనల వల్ల, అసలు యజమాని వాహనంపై 23 చలాన్లు తప్పుగా నమోదయ్యాయన్నారు.నిందితుడిపై చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో బి.ఎన్.ఎస్ సెక్షన్లు 319(2), 318(4) మరియు మోటార్ వాహనాల చట్టం ఎం వి యాక్ట్ సెక్షన్లు 158, 177 కింద కేసు ఎఫ్ ఐ ఆర్ (48/2026) నమోదు చేశారన్నారు.నగరంలోని సిసిటివి (CCTV) మరియు ఏఎన్‌పీఆర్ (ANPR) కెమెరాల ద్వారా ఇటువంటి ట్యాంపరింగ్ కేసులను సులభంగా గుర్తిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
మీ వాహన నంబర్ ప్లేట్లు ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే
ఈ క్రింది మార్గాల్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వెబ్‌సైట్: https://echallan.tspolice.gov.in
• ఈమెయిల్: echallanhelpdesk.hyd@gmail.com
• వాట్సాప్ నంబర్: 8712661690
తప్పుడు నంబర్ ప్లేట్లు వాడటం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘనలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని జాయింట్ కమిషనర్ స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *