దర్శి పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శుక్రవారం నిర్వహించిన మెడికల్ క్యాంప్ విజయవంతంగా పూర్తైంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మెడికల్ క్యాంప్‌లో పాఠశాలలోని టీచింగ్ మరియు నాన్-టీచింగ్ సిబ్బందితో పాటు విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా దంత మరియు కంటి పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందించారు.
మెడికల్ క్యాంపులో డెంటల్ డాక్టర్ సమీర్ మరియు కంటి వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ పాల్గొని విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, దంత సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, సమతుల ఆహారం వంటి అంశాలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం ఎన్. పెద్దిరెడ్డి ప్రిన్సిపాల్ పి. అంజిరెడ్డి, హెచ్ఆర్ మస్తానయ్య పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వారు పేర్కొన్నారు.
మెడికల్ క్యాంప్ ద్వారా విద్యార్థులు మరియు సిబ్బంది ఆరోగ్య స్థితిని తెలుసుకుని, అవసరమైన వైద్య సూచనలు పొందడం పాఠశాల వాతావరణానికి మరింత భరోసాను కలిగించింది.


