బేగంపేట ఫిబ్రవరి 15
(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్టలో హజ్రత్ పీర్ ఉర్స్ ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రార్ధనలలో పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్ కుమార్, నిర్వాహకులు అష్రఫ్ అలీ, సర్ఫరాజ్ అలీ, ముజాహిద్, మజీద్, అఫ్సర్, సమీర్, సైఫ్, లతీఫ్, రైమాన్, నాయకులు చంద్ర ప్రకాష్ తదితరులు ఉన్నారు.

