జిల్లాలో ఐరన్ ఓర్, ఇతర ఖనిజాలను వెలికి తీసేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు అవసరమైన భూములకు క్లియరెన్స్ ఇచ్చే
ప్రక్రియను వేగవంతం చేస్తామని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, జిల్లా అటవీ అధికారి ( టెరిటోరియల్ ) వినోద్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఖనిజాలు ఉన్న భూములు రెవెన్యూ, అటవీ శాఖల పరిధిలో ఉన్నందున, కొన్నిచోట్ల సరిహద్దు పై స్పష్టత లేనందున జాయింట్ సర్వే చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. ఖనిజాలు ఉన్న భూములను అటవీ శాఖ నుంచి తీసుకోవాల్సి వస్తే ఆ మోతాదుకు తగినట్లుగా అడవులు పెంచేందుకు నష్టపరిహార భూములను కూడా అటవీ శాఖకు ఇస్తామన్నారు. అనంతరం గనులు, అటవీ శాఖ అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ దిశగా ప్రతిపాదనలు రూపొందించాలని వారికి చెప్పారు.

